Illustration of someone climbing down a staircase as other people engage in various activities like cleaning and selling fish around them, all are behind a stack of cameras.

చిత్రం : సిద్దేశ్ గౌతమ్

సాంకేతిక కుల గూఢచర్య చట్రాల నిర్మాణ పునాది రాళ్లు: భారత దేశపు నిత్య జీవితంలో బ్రహ్మణీయ పర్యావేక్షణ

Nikita Sonavane, Mrinalini R, Aditya Rawat, Ramani Mohanakrishnan and Vikas Yadav

This article by Nikita Sonavane, Mrinalini R., Aditya Rawat, Ramani Mohanakrishnan, and Vikas Yadav was originally published in English as “Building Blocks of a Digital Caste Panopticon: Everyday Brahminical Policing in India.” It was translated into Telugu by Sushma Gumpenapalli, with copy-editing by Arunank Latha.

తెలుగు అనువాదం: సుష్మా గుంపెనపల్లి

ప్రతి సంపాదకత్వం: అరుణాంక్ లత

 భారతదేశంలో దక్షిణాదినున్న తెలంగాణ రాష్ట్రం, తాను కలలు కన్న “అమెరికన్ డ్రీం ”ని సాకారం చేసుకున్నది.  తన కలకు దృశ్య రూపమిచేద్నుకు గాను భారతదేశంలోనే మొట్టమొదటిగా గా "ప్రపంచ స్థాయి నిర్మాణం" తలపించేలా అపారమైన ఇరవై అంతస్తుల అద్దాల భవనాలు ఐదు నిర్మించింది.  అత్యాధునిక సాంకేతిక అభివృద్ది సహకారం తో  పర్యవేక్షణ యంత్రాంగాన్ని- పోలీసింగ్ ను విస్తరిమ్పచేయడమే దీని ఉద్దేశం.  ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కట్టడాన్ని తెలంగాణా రాష్ట్ర సుధీర్ఘ పోరాట సాధనా ఫలితానికి గుర్తుగా పాలక ప్రభుత్వం ప్రకటించింది. అట్టి వ్యవస్థను, ఆగష్టు 2022లో రాష్ట్ర రాజధానైన హైదరాబాద్ నగరం నడి బొడ్డున స్థాపించింది.. తెలంగాణ పోలీసు శాఖ ఈ సాంకేతిక సౌధాన్ని “ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్” (సమీకృత నియంత్రిత ఆదేశ కేంద్రం) అని నామకరణం చేసి, దీనిని న్యూయార్క్ నగర పోలీసు శాఖ పోలీస్ ప్లాజాకు సమానమైన భారతీయ కేంద్రమని సగర్వంగా అభివర్ణించింది. రాష్ట్ర రాజధానైన హైదరాబాద్ నగరాన్ని ఒక నియో లిబరల్ ప్రయోగశాల గా తీర్చిదిద్దదానికి, తెలంగాణ రాష్ట్రాన్నెసమాచారోత్పత్తి కేంద్రం గా ఎంచుకున్నారో, అప్పుడే ఈ కేంద్రం ఏర్పాటుకు బీజం పడింది. 

ఇతనికి పూర్వపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంకు వెన్నుదన్నుతో హైదరాబాద్‍ను భారతదేశపు కాబోయే ‘సిలికాన్ వ్యాలీ’గా అభివృద్ధి చేసినట్లే, అతని ఆలోచనలు పుణికిపుచ్చుకొని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన కొన్నాళ్లకే, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‍రావు – విదేశీ పెట్టుబడులకు “సురక్షితమైన” ప్రదేశాలను సృష్టించేందుకు హైదరాబాద్‍ని నయా ఉదారవాద పట్టణ ప్రయోగశాలగా మలిచే  రాష్ట్ర విధి విధానాలను అవలంభించడం జరిగింది. ఉద్దేశించబడిన సురక్ష ఆవరణలు రూపొందేందుకు గాను  పోలీసింగ్ వ్యవస్థ లో ఘననీయ మార్పులను  పరిచయం చేసాడు.  ఇందులో భాగం గా,  విధానపరమైన నిర్ణయాల ద్వారా రాష్ట్రాన్ని సమాచార వృద్ధికి కేంద్రంగా అమర్చి, నిఘావ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ‘సురక్షణ’ అనేది నిరవేరినట్టు  చాటి చెప్పాడు . ఈ నిఘా వ్యవస్థను తన ఉద్దేశానికి సానుకూలం గా బలపరిచేందుకుగాను “మహిళల భద్రత” పేరున నిఘాకు సంబంధించిన కొన్ని చట్టాలను  ప్రవేశపెట్టారు .   బహిరంగ ప్రదేశాలలో పెరుగుతున్న మహిళల సంఖ్యకు “రక్షణ”ని ఇవ్వడానికనే తర్కాన్ని వాడారు. 

తద్వారా “మహిళల భద్రత” పేరున నిఘాకు సంబంధించిన కొన్ని చట్టాలను ప్రవేశపెట్టారు. తెలంగాణ నిఘా వ్యవస్థలో ఘననీయమైన మార్పులు ప్రవేశ పెట్టారు. ఉదాహరణకు 2014లో తెలంగాణ పోలిసుల పునర్నిర్మాణం కోసం $203.8 మిలియన్లను కేటాయించారు. ఇందులో హైదరాబాద్ నగర విభాగానికి $82.5 మిలియన్లను కేటాయించారు. ప్రైవేట్ సంస్థలు, సమూహాలు ఏర్పాటు చేసిన CCTVలతో సహా తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు 925,000 సీసీటీవీలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3,70,000 హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నాయి.

తెలంగాణ కూడా కుటుంబ సమగ్ర సర్వే అని పిలువబడే భారతదేశంలోనే అతిపెద్దదైన ఒక రోజు- సామాజిక ఆర్థిక సర్వేను  సన్నాహకంగా నిర్వహించి ప్రభుత్వ నిఘా యంత్రాన్గానికి తగు మరమత్తులు చేకుర్చుకున్నది. ఈ సర్వే ద్వారా  వ్యక్తులు - వారి కుటుంబ సభ్యులు, వైకల్యాలు - దీర్ఘకాలిక వ్యాధులు, గృహనిర్మాణం - చరాస్తుల వివరాలను నమోదు చేసి పౌర జీవితంలోని తొంభై నాలుగు ప్రమాణాలను లెక్కించడానికి యత్నించింది.“సమీకృత ప్రజా సమాచార కేంద్రం” (Integrated People Information Hub) అనే పేరుతో రాష్ట్ర ప్రజల జీవితాలను 360 కోణంలో తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ప్రారంభించింది. ఇటువంటి ప్రజల సమాచార కేంద్రాలు ఇప్పుడు భారత రాష్ట్రాల అంతటా పెరుగుతున్నప్పటికీ, తెలంగాణ సర్వే ఒక  విపరీతమైనది: సమాచారాన్ని సంగ్రహం చేయడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషించడమే గాక, ఐటీ విభాగానికి బదిలీ చేయడానికి ముందు రెండు సంవత్సరాల పాటు సమాచారాన్ని తన ఆధీనంలో ఉంచుకుంది. దక్షిణ భారతదేశానికి చెందిన ఒక సాంకేతిక పరిశోధకుడు మాకు వివరించిన దాని ప్రకారం, “తరచుగా ఈ సర్వేలు గ్రామీణాభివృద్ధి శాఖ, ప్రణాళిక లేదా కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా నిర్వహించబడతాయి. IT డిపార్ట్‌మెంట్ కింద ఉన్న ఈ ఇ-గవర్నెన్స్ సంస్థ దగ్గర డేటా ఉంచేందుకు అవకాశం ఉండగా, పోలీసులకు అందించేందుకు చేసిన అనధికారిక ఏర్పాటు ఇది”. 

ఒక ప్రత్యేకమైన  నిఘా వ్యవస్థను బాహాటం చేయడం, సాంకేతిక సాధనాలకు నెలువు గా మారడం  ద్వారా మాత్రమే  భద్రతా, అభివృద్ధి అను రెండు అంశాల మీద దృష్టి  సారించడం గా  తెలంగాణా రాష్ట్రం చిత్రీకరించింది. దీని కోసం పోలీసు వ్యవస్థను మరింత “సమర్థవంతంగా’, మరింత సర్వవ్యాపితంగా చేసేందుకు సన్నాహాలు చేపట్టి అందులో భాగం గా హైదరాబాద్ పోలీస్ వ్యవస్థ, తాను ఉదహరించుకున్న “న్యూయార్క్ 

నగర పోలీస్ శాఖకు” ఏ మాత్రం తీసిపోకుండా, నగరంలోని అణగారిన వర్గాల జీవితాలు, దేహాలపై నిఘాని తీవ్రతరం చేసేందుకు సాంకేతిక నైపుణ్యాన్ని ఉపయోగించింది . ప్రత్యేకించి, దేశంలో హిందూ జాతీయవాదం ప్రభాలుతూ ముస్లింలను నేరస్తులుగా పరిగణిస్తున్న కాలంలో, హైదరాబాద్ నగరం  ‘స్మార్ట్ పోలిసింగ్”కి నమూనాగా నిలిచింది. అణగారిన ప్రజల సాంకేతిక సమాచారం సంకలనం చేసే ఈ కులతత్వ నిఘా కార్యక్రమంలో అణగారిన కులాల సమూహాలు ప్రధానంగా భాగం.

తత్వవేత్త మిషెల్ ఫూకో చేసిన ఆధునిక క్రమశిక్షణా సమాజాల విశ్లేషణను, తరువాతి  కాలంలో అతను చేసిన “ప్రభుత్వ రూపంలో అధికారం” అను అధ్యయనం ఆధారం గా “హద్దుల్లేని సాంకేతిక నిఘా, సర్వేల వంటి సాధనాలతో కలిపి మనం పిలుస్తున్న “సాంకేతిక కుల గూఢచర్యం” అనేది ఏర్పాటు అవుతుందనే విషయం చుట్టూ మా వాదన తర్కిస్తుంది.  తెలంగాణ విషయానికి వస్తే, పెరుగుతున్న సాంకేతిక నిఘా,సామ్రాజ్య వాదం కులాల సంగమాన్ని పటిష్టం చేస్తుందని మేము వాదిస్తున్నాము. మేము "బ్రాహ్మణీయ పోలీసింగ్” అనే పదాన్ని నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో స్వచ్ఛత/ పాత్వ్రత్యం  సారాంశంగా పై మెట్టులో బ్రాహ్మణులను ఉంచేందుకు బలవంతంగా రుద్దిన భావజాలాన్ని సూచించడానికి ఉపయోగిస్తున్నాము, అది జీన్స్ను/పుట్టుక  ఆదరం గా శ్రేష్టతను నిర్నయిన్చేతువంటి భావాల మిద ఆదర పది నిర్మించబడ్డ సామ్రాజ్యవాదం తాలుకు మూల సిద్ధాంతాలను తనలో కలిగి ఉన్నది. ఈ విధమైన పోలిసింగ్ దాని పరిధిని బాహిర్గాహక ప్రదేశాల నుంచి దయనిందనీయ జీవితాలల్లోకి  చొచ్చుకు పోయింది.  మా విశ్లేషణలో, మతాన్ని రూపొందించడంలో కులరహిత భావనను కూడా మేము సవాలు చేస్తున్నాము, నిఘాకి సంబంధించిన సమస్యలతో కట్టుపడేందుకు కుల వ్యతిరేక చట్రాన్ని భారత ఉపఖండంలో అమలు చేయాలని కోరుతున్నాము, బహుశా అంతకు మించి.

హైదరాబాద్‍లో ముస్లిముల కుల, నేరమయికరణ

భారత దేశాని స్వాతంత్రం మునుపటి వరకు పరిపాలించిన నిజాం అంస ను  పునికిపుచ్చుకున్న, హైదరాబాద్ గడ్డ, ఒక దేదీప్యమైన ముస్లిం సంస్కృతీ కి నెలవు గా మారినది. జాతీయ సగటు 14%, తెలంగాణలో 12% ఉన్న ముస్లిం జనాభా హైదరాబాద్‍లో 43 శాతంగా ఉన్నది. 2016లో వచ్చిన ఒక ప్రభుత్వ రిపోర్ట్ ప్రకారం ఈ రాష్ట్రంలోని ముస్లింలలో 81 శాతానికి పైగా సామాజిక - విద్యా పరమైన వెనుకబాటు లో ఉన్నారని గుర్తించింది.  మరొక రిపోర్ట్ ప్రకారం, పాతబస్తీ ప్రాంతంలో 87 శాతం వరకు ముస్లింలు రోజు వారి కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, మాంసపు దుకాణాల్లో మాంసం కొట్టేవారిగా మాత్రమే జీవనోపాధిని కలిగి ఉన్నారు. ఖాలిద్ అన్సారి లాంటి పరిశోధకుల ప్రకారం “ఇస్లామోఫోబియా”(ఇస్లాం మతస్తుల పట్ల ద్వేషం, వివక్ష కనబరుచుట) ను, పాలిత వర్గాలు వంకగా చూపించి, ముస్లింలలో ఉన్న కుల వివక్షను అణచిపెడుతున్నారు. 2016 లోని ఒక రిపోర్ట్ ప్రకారం, “కుల వృత్తుల్లో” ఉన్న ముస్లింలపై సాటి ముస్లింలే వివక్ష చూయిస్తున్నారు అని తెలపబడింది.

మూడు వేల సంవత్సరాలకు పైగా స్థీరీకరించి ఉన్న కుల వ్యవస్థ, భారత ఉపఖండంలోనే పురాతన సామాజిక ఆర్థిక వ్యవస్థ. ఇస్లాం వంటి "కుల రహిత" మతాలు కూడా దాని ప్రభావం నుండి తప్పించుకోలేదు. పుట్టుక ఆధారిత క్రమానుగత సామాజిక క్రమం ఆధారితం గా  ఈర్పాటు చేసుకోబడ్డ వర్ణ వ్యవస్థ లో పురోహితులైన బ్రాహ్మణులు అత్యున్నత స్థానాన్ని ఆక్రమించి ఉంటారు. ఆ తర్వాత క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. కులం అనేది భారతదేశంలోని దాదాపు అన్ని సమూహాలు, విశ్వాసాలలోనూ విస్తరించి ఉన్నది. దాని స్వజాతి వివాహ స్వభావాన్ని బట్టి, ఇది కేవలం సామాజిక ఆచారం కాదు, ఆర్థికపరమైనది కూడ. ప్రతి విభిన్న జాతి (వర్ణంలోని ఒక ఉప సమూహం) ఒక నిర్దిష్ట వృత్తిని కలిగి ఉంటూ, వృత్తులను వంశపారంపర్యంగా చేస్తుంది. అటవీ - నివాస ఆదిమ ఆదివాసి జాతులు, దళితులు (ఈ సమూహాల మీద అస్పృశ్యత చారిత్రాత్మకంగా రుద్దబడినది), సంచార తెగలు ఈ వ్యవస్థ చివరన కొనసాగుతున్నారు. మను చట్టాలు, లేదా మనుస్మృతి, కుల వ్యవస్థను దృఢపరచే తొలి (గ్రాన్దీకరించబడిన తోలి చట్టాలలో ఒకటి గ భావించబడే దైవాదారిత చట్టం) గ్రాంధీకరించబడిన చట్టాలలో ఒకటి, దాని ఉల్లంఘనకు వివిధ నిమ్న-కుల సముహాలు, తెగలు, మహిళలకు విధించే శిక్షలలలో  వ్యత్యసాన్ని ఆపాదిస్తుంది. తద్వారా కుల క్రమం లోపటి  వేర్ల మూలాన్ని గుర్తించింది.  మరో మాటలో చెప్పాలంటే, ఈ క్రమానుగత వ్యవస్థను నిర్వహించడానికి, పునరుత్పత్తి చేయడానికి, హిందూ సామాజిక క్రమం ప్రాథమికంగా పోలీసు, శిక్షలలో విస్తృతమైన పద్ధతులపై ఆధారపడింది. ఈ కుల ఆధారిత నిర్దేశాలకు తదనంతర కాలంలో బ్రిటిష్ వలస పాలకులు ఆధునిక చట్టపరమైన రూపాన్ని అందించారు.

1800ల తొలినాళ్ళలో బ్రిటిష్ పరిపాలకులకు తమ వాణిజ్య కార్యకలాపాల లక్ష్యాల్లో భాగంగా ‘నేరాన్ని’ అరికట్టడమనే అవసరం ఏర్పడింది. అందులో భాగంగా “దారి దోపిడీ, బందిపోటు దొంగలను అరికట్టే శాఖ” (Thuggee and Dacoity Department) ను ఏర్పాటుచేసింది. ఆ శాఖ “థగ్గు”లను దారిదోపిడీలకు పాల్పడే వారిగా, ఇతర కులాధారిత వృత్తుల్ని చేస్తున్న వారిలాగే వీరూ అనువంశీకంగా ఇదే వృత్తిగా ఉన్నవారిగా అభివర్ణిస్తు వారిని “నేరస్తుల వర్గం”గా ప్రకటించింది. తదనంతరం 1850ల నాటికి వీరి విశ్వాసాలు, భాష, సంస్కృతీ, కదలికల సమాచారాన్ని సంఘటితపరచి వీరిని “నేర సమూహాలు” గా అభివర్ణిస్తూ వారి పై విభజన, నిఘా, పోలీసింగ్ వంటి పద్దతుల ద్వారా పర్యవేక్షణ చేసారు. ఇటువంటి సామ్రాజ్యవాద మానవ శాస్త్రం (colonial anthropology) భారతదేశంలోని బ్రాహ్మణీయ భావజాలంతో సమన్వయం ఏర్పరచుకున్నదనని సమకాలీన పరిశోధకులు కనుగొన్నారు, అంతిమంగా ఇది నేరస్త తెగల చట్టం (Criminal Tribes Act) , 1871కి మార్గం వేసింది. అది “నేరస్త తెగల”ను నేరానికి “అలవాటు”పడిన వారిగా పేర్కొన్నది.

బ్రిటిష్ పాలన కాలంలో, హైదరాబాద్ ఒక రాచరిక రాష్ట్రంగా ఉంది, అంటే బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలు చుట్టూ ఉన్నప్పటికీ అది నేరుగా బ్రిటిష్ పాలనలో లేదు. ఏది ఏమైనప్పటికీ, 1896లో, పటిష్టమైన హైదరాబాద్ నగరం కూడా “బందిపోట్ల” గా భావించ బడుతున్న వారికి, కొంత సామాజిక, ఒక ఉపద్రవంలా పరిగణించ బడి, సాంస్కృతిక పెట్టుబడి ఉన్న లంబాడా సమూహాని (ఒకనాటి నేరస్త తెగ గా గుర్తించబడినది) కి మార్గం గా సహకరించే స్వభావం కలిగి ఉన్న  కారణం చేత  తనదైన నేరస్త తెగల చట్టాన్ని జారీచేయాల్సిన స్థితికి నెట్టబడింది.

సంచార జాతుల ప్రజలను పర్యవేక్షణ చేస్తూ, వారి పై నిఘా సంధించి, వారిని పునరావా

సులను చేస్తూ, ఒక ప్రాంతానికి పరిమితం చేయడమే “క్రిమినల్ ట్రైబ్స్ చట్టం” ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని సఫలీకృతం చేసుకొనుటకు, వారిని కొన్ని గ్రామాల్లోనూ, సంస్కరణశాలల్లో పరిమితించుటకు, వారి సామాజిక జీవితాలల్లోని ప్రతి, దైనందీన అంశాలనూ పర్యవేక్షణలోకి తీసుకుని వచ్చారు. వారు స్థానిక పోలీసు స్టేషన్లలో నమోదు చేసుకోవాలని, జరిమానాలు, శిక్షలను ఎదుర్కోవాలని ఆదేశించారు. బ్రిటీష్ పరిపాలన విభాగం వారి ఉనికిని గుర్తించడానికి వారి శరీర కొలతలు, రోల్ కాల్స్ (హాజరు నమూనాలు) సహా అభివృద్ధి చెందిన సాంకేతికతతో వేలిముద్రలు, ఇతర  వివక్షతలతో కూడిన మానవ శరీర శాస్త్ర పద్దతులను అవలంభించింది. 

బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత 1952లో, భారతదేశం CTAని రద్దు చేసింది. గతంలో నేరపూరితమైన సమూహాలుగా పేర్కొన్నవారిని డీనోటిఫైడ్ ట్రైబ్స్ (లేదా DNTలు)గా పిలుస్తున్నారు. అయినప్పటికీ, ఇంతకాలం DNTలను నీడగా వెంటాడిన నిఘాకు ఇది అంతం కాదు. 1948లో హైదరాబాదు నిజాం భారత యూనియన్‌తో విలీనం కావడానికి నిరాకరించినప్పుడు, భారత ప్రభుత్వం సైనిక చర్య (లేదా "పోలీసు చర్య")ను చేపట్టింది. అదే కాలంలో ఒక సమాంతర కథ పురుడుపోసుకుంది. ఆర్యసమాజ్ (హిందూ సంస్కరణవాద సంస్థ) చేసిన మతపరమైన ప్రచారం హైదరాబాద్‌లోని ముస్లిం పారామిలిటరీ దళం అనేది పూర్తీ ముస్లిం సమాజం తాలుకు తెగులుగా చిత్రీకరించబడింది.  శాంతిభద్రతలను కుప్పకూల్చడం, "అణచివేతకు గురైన హిందువులకు" మద్దతు ఇవ్వడం అనే కారణం చూపి యూనియన్ చేసిన ఆక్రమణలో ముస్లింల సామూహిక హత్యలు, లైంగిక హింస, లూఠీలకు దారితీసింది.

ఆధునిక హైదరాబాద్‍లో ముస్లింల పౌరహక్కు:

భారత యూనియన్ లోనికి హైదరాబాద్ ని వీలినం చేసుకున్న నాటి నుండి పోలిస్ వ్యవస్థ – ముస్లింల మధ్య సంబంధం “అభద్రతా – అనుమానం”గానే కొనసాగుతున్నది. భారతదేశంలోని మానవ హక్కుల పరిశోధకులలో, ముస్లిం వ్యతిరేక నిఘా వైఖరి అనేది ఇప్పుడు ఏకాభిప్రాయానికి సంబంధించిన అంశం. అదే సమయంలో, ముస్లింల వైవిధ్యత తరచుగా విస్మరించబడింది. షేక్ యూసుఫ్ బాబా @ "స్కై బాబా" అనే తెలంగాణ రచయిత అనేక ఇస్లామిక్ కమ్యూనిటీలు కులంతో పెనవేసుకుపోయినప్పటికీ , ముస్లింలలో కులం గురించిన సంభాషణలు చాలా అరుదుగా జరుగుతాయని, ఉదాహరణకు సోనార్, హజామ్ ముస్లింలు స్వర్ణకారు-పనులలో(స్వర్ణకారులు), క్షవర వృత్తిలో (మంగలి గా గుర్తించబడిన కులం) వారుగా నిమ్న-కులాలకు సంబంధించిన కుల-ఆధారిత వృత్తులు) ఉన్నారని పేర్కొన్నారు.

రాజకీయంగా అతితక్కువ ప్రాతినిధ్యం కలిగిన గతంలోని నేరపూరితమైన సమూహాలు, కులం – మతం మధ్యనున్న అస్పష్టమైన సరిహద్దులతో సతమతమైనాయి. డీ-నోటి ఫైడ్ తెగలు, సంచారాల జాతులు హిందూ మతం, ఇస్లాం తో పాటు అనేక మత విశ్వాసాలను పాటించేవారని రీన్కే కమీషన్ రిపోర్ట్ తెలుపుతున్నది. డీనోటిఫైడ్ ట్రైబల్స్ రాజకీయ వేదిక, కన్వీనర్ ఎం సుబ్బారావు మాటల్లో, “హిందూ కులాల నుంచి అన్య మతాలలోనికి మారిన దళిత జాతి ప్రజలు, ఇతర వెనకబడిన కులాల ప్రజలు, ఇప్పటికి జీవనోపాధి కోసం వారి కుల వృత్తినే పాటిస్తూనే ఉన్నారు. ముస్లిములైనప్పటికీ రాళ్లు కొట్టే పని చేసేవారున్నారు. ఫకీర్ (సంచార ముస్లిం మతస్తులు ) గడప గడపకి, దుకాణలకు వెళ్లి దూపం వేస్తూ సంపాదించుకుంటారు. 

హైదరాబాద్‍లో ముస్లిం మతస్తులు  అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ నిమ్న కులాల ముస్లింలు మాత్రంవేలివేయబడ్డి వారిగా   మారారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సామాజిక అమరికలో ముస్లింలు కింది శ్రేణిలో ఉన్నారు. దీనినే చరిత్రకారుడు రాధాకుమార్ "ప్రాంతాల సోపానక్రమం" అని పేర్కొన్నారు. అలా కింద ఉండటం చేత నిఘా అనేది వారి దైనందిన జీవితంలో భాగమైపోయింది. 

2015లో హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన “మిషన్ చబుత్రా”ను పరిశీలిస్తే, దీని ఫలితంగా పెద్ద సంఖ్యలో ముస్లింలు నివసించే పాతబస్తీలో ఎక్కడిక్కడా సోదాలు చేశారు. ఈ మిషన్ కింద, "సంచారం చేసే యువత" రాత్రిపూట తమ పరిసరాల్లో "అలసట"గా కనిపిస్తే, వారి వెలి ముద్రలు సేకిరించడమే పనిగ పెట్టుకున్న పోలీస్ వ్యవస్థ , వారి వెలి ముద్రలను తేలికగా ఎక్కడికైనా తీసుకువెళ్ల గలిగే వీలున్నటువంటి సాంకేతిక సాధనల ద్వార స్కాన్ చేసి, వారు ఇంతక మును ఏదన్న కేసులో నిందితులగ ఉన్నారా అని, వారంట్ పెండింగ్ ఉన్నాయని వారి నేర చేరిత్రను తొవ్వి, కొన్ని సందర్భాల్లో ఇటువంటి యువతను క్రమబహ్దీకరించావలసింది గా ముస్లిం మత పెద్దలు సూచనలు ఇచ్చేవరకు వెళ్ళింది. 

ఈ క్రమంలో భాగంగా కులతత్వ “మర్యాద”ను అమలు చేసేందుకు పోలీసులు ప్రజా ప్రయోగానార్ధం పేరు మీద సామాజిక క్రమశిక్షణను అమలు పరుస్తారు, CTA వారసత్వాన్ని కొనసాగిస్తారు. CTA రద్దు చేసిన తరువాత కూడా అనేక భారతీయ అదే బ్రాహ్మణీయ సామాజిక నిబంధనలను సమర్థిస్తూ, "నేరస్థ తెగలు/ నేరాపాదిత తెగలు "కు బదులుగా "స్వాభివిక నేరస్థులు”గా పరిగణించే కొత్త చట్టాలను రూపొందించాయి. తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ చట్టాలు అమలులో ఉన్నాయి.

అణచివేతకు గురైన కుల సమూహాలు- ఎలా “స్వాభావిక నేరస్తులు” గా మారుతున్నారు?

ఏప్రిల్ నెలలో మిట్ట మధ్యాహ్నం, హైదరాబాద్‍లోని ఒక అవార్డు గెలుచుకున్న,పోలిస్ స్టేషన్‍కి వెళ్ళినప్పుడు, ఇంజనీర్ నుండి పోలిస్ ఆఫీసర్‍గా మారిన అతను స్టేషన్ లోని వివిధ భాగాలను మాకు చూపించారు. ఒక రిసెప్షన్, అడ్మినిస్ట్రేటివ్ డెస్క్ : కంప్లైంట్ల నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేసే విభాగం; మహిళా సహాయ విభాగం, లాకప్, ఆయుధ భాండాగారం వంటివి ఉన్నాయి. స్టేషన్ గోడలు మొత్తం వివిధ నీతి మాటల చిత్రాలతో, పోస్టర్లతో నిండి ఉన్నాయి. ఆ నీతి మాటలు చాల వరకు కోపము, అహం తగ్గించుకోవాల్సిందిగా, సమయ పాలన ప్రాముఖ్యతను సూచిస్తూ ఉన్నాయి. తరువాత,  పునరావృత/ స్వాభావిక నేరస్థులకు సంబంధించిన ఉగ్ర నిఘా గురించి వివరిస్తూ తాము ఒక యాప్‍ను (App) వాడి వారిని ఫోటోలు తీసి, రోజూ ఏ  ప్రాంతంలో ఉన్నారో తమ తమ e-tabsలో  రికార్డు చేసుకుంటున్నట్టుగా తెలిపారు. ఈ విషయం మాకు చాల ఆశ్చర్యం కలిగిస్తే, అ పోలీస్ ఆఫీసర్ మాత్రం ఇలాంటి పద్దతిని పాటిస్తున్నందుకు చాల గర్వంతో, “వాళ్ళు 24 గంటలు మా ఆధీనంలో ఉన్నట్టే” అని మాకు చెప్పారు. ఒక మనిషి ఫోటోని మాకు చూపించి, అది సుమారు ఉదయం రెండు గంటలు సమయములో సాధారణ పని దినాలల్లో తీసుకున్నదిగా పేర్కొన్నారు. 

తెలంగాణలో, వరుసగా ఐదేళ్ల కాలంలో మూడుసార్లు దోషిగా శిక్షపడిన వయోజనుడ్ని "పునరావృత/ స్వాభావిక/ స్వాభావిక నేరస్థుడు" అంటారు. CTAకి స్పష్టమైన కొనసాగింపుగా 1962కి ముందున్న పునరావృత/ స్వాభావిక నేరస్థుల రికార్డులు ఈ చట్టానికి బదిలీ చేశారు. పునరావృత/ స్వాభావిక నేరస్థుల చట్టం 1962 (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత తీసుకున్నది) కింద రికార్డులను ఐదేళ్ల పాటు మాత్రమే నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ఈ “నమోదు” మరో ఐదేళ్లపాటు పొడిగించబడవచ్చు. దీని వలన వ్యక్తులను ఎప్పుడైనా పోలీసు స్టేషన్‌లకు పిలవవచ్చు, వారి కదలికలు పరిమితం చేయడమే గాక, సంస్కరణ గృహాలకు (జైళ్ళకు) కూడా పంపవచ్చు.

ఈ సందర్భంలో, భారతదేశంలో రాష్ట్ర స్థాయిలో రూపొందించబడిన పోలీసు కరదీపికలు, విజ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థగా పోలీసింగ్ యొక్క  పాత్రను కీలకంగా వెల్లడిస్తున్నాయి. ఈ కరదీపికల ఆధారంగా పొందుపరిచిన సమాచారం రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. పీడనకూ – అణచివేతకు గురైన జాతుల సమూహాలపై “ఆధారం గా ” నిఘా వనరుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవడానికి ఆధారంగా పనిచేస్తాయి. తద్వారా రోజువారీ ప్రాతిపదికన కుల- వర్గ సంబంధాలను శాశ్వతం చేస్తాయి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ కరదీపిక (తెలంగాణా కూడా దీనినే అవలంభిస్తున్నది) ఆధారంగా పునరావృత/ స్వాభావిక నేరస్తుల మీద నిఘా చేపట్టేందుకు విభిన్న పద్దతుల ద్వార నిఘాని చట్టపరిధికి మించి విస్తృత పరిచారని మనం గమనించవచ్చు. ‘శాంతి భద్రతల సమతుల్యాన్ని కాపాడేందుకు’ నేరారోపరణ, నేరస్తుల నేపథ్యం ఆధారంగా పలు ‘జాబితాలను’ తయారు చీయడంను ఈ సూచుక అనుమతిస్తుంది. వర్గీకరణ ఆధారంగా అందులోని వ్యక్తులను “మామూలు” లేదా “నైపుణ్య” నేరస్తులుగా పరిగనిస్తారు. వారిని “అనుమానిత పత్రాల్లో’, “రౌడీషీట్లలో”, “చెడు స్వభావం”  సంబంధించ కేసుల పత్రాల్లో”, “హిస్టరీ షీట్స్”లో నమోదు చేస్తారు. వాటి ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్ స్థాయి నుంచి, జిల్లా, రాష్ట్రస్థాయి ఇంటలిజెన్స్ శాఖల వరకు వివిధ రకాలైన నిఘా పద్దతులను పాటిస్తారు. అంతేకాకుండా, మొదటిసారిగా నేరారోపణ మోపబడిన వ్యక్తి నేర చరిత్ర కలిగిన కుటుంబం లేదా సమూహానికి చెందినవారైతే లేదా " స్వాభావిక నేరస్తులు గా ముద్రించాబడ్డ"  వారి బంధువు అయినట్లయితే, వారు సహజసిద్దంగా "నేరమే వృత్తిగా బ్రతికే వారు”గా వర్గీకరించబడతారు. నిర్దిష్ట కులాలు, తెగలతో చారిత్రక అనుబంధాల కారణంగా పిక్‌పాకెటింగ్ లేదా "పోకిరి" వంటి చిన్న నేరాలు కూడా "వృత్తి” నేరస్థులతో ముడిపడి ఉంటాయి. వృత్తిపరమైన నేరస్థుల కోసం పోలీసు అధికారులతో రోజువారీ చెక్-ఇన్‌లను తప్పనిసరి చేస్తూ వారి కోసం హిస్టరీ షీట్ తయారుచేస్తారు. అటువంటి సందర్భాలలో, బీట్ కానిస్టేబుల్‌లను ఈ "హిస్టరీ-షీటర్‌ల"పై రాత్రిపూట తనిఖీలు చేయమని, పోలీసు స్టేషన్లో అన్ని  సంఘటనలను రికార్డ్ చేసే జనరల్ డైరీలో రోజువారీ రెడ్ ఇంక్ ఎంట్రీలను నిర్వహించమని ప్రోత్సహిస్తారు. ఈ సమాచారాన్ని పొరుగు స్టేషన్‌లు, నగరం లేదా జిల్లా స్థాయిలో సూపర్‌వైజర్‌లు, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేర గణాంకాలను సంకలనం చేసే జిల్లా నేర నమోదు శాఖతో సహా పోలీసు అధికార వ్యవస్థలో అన్ని స్థాయిలలోకి చేరుస్తారు. ఈ సమాచారాన్ని పంచుకోవదానికి ఎలాంటి పరిమితి లేదు, ఇందులో వ్యక్తుల ప్రవర్తన, వ్యవహారాలు, వారి కుటుంబీకుల, సంబంధీకుల సమాచారం, వారి వ్యక్తిగత జీవితాల్లో సంభవించిన మార్పులూ నమోదు చేసి ఉంటుంది. 

స్వాభావిక నేరస్తులను (“నేరమే వృత్తిగా జీవించే వారు”, “నేర చరిత్ర కలిగిన వారు” ఇలా చేసే అనేక భిన్నమైన, అతివ్యాప్తి వర్గాలుగా)  వర్గీకరించే ఈ విచాక్షణాపూర్వక లక్షణము చక్కని పరిపాలన రూపంలో కనిపించే కులతత్వ నేరపూరితమైన కులతత్వ నిర్మాణాన్ని స్పష్టంగా పునరుత్పత్తి చేస్తూనే ఉంది. ఎరుకల సామాజిక తెగ (DNT జాతి లో ని ఒక తెగ) కు సంబంధిచిన ఒక కుటుంబం, వారి కుటుంబ సభ్యులు పోలీసుల చేత ఎలా తరుచుగా తీసుకువేల్లబడి, తప్పుడు కేసులు పెట్టకుండా ఉండేందుకు వారిని పోలీసులు దోచుకుంటారో వారు మా కు వివరించారు .ఒకవేళ వారిలో ఎవరైనా జిల్లా, రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే వాళ్ళు తప్పకుండా పోలిస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలి. అంతేగాక వారి వ్యక్తిగత గుర్తింపు పత్రాలు, కాల్ రికార్డులు, బయోమెట్రిక్ డేటా కాపీలను పోలీసులు తీసుకున్నారని తెలిపారు. పోలీసు మాన్యువల్ ప్రకారం, పోలీసులు తప్పనిసరిగా ఈ రికార్డులను అన్ని అవుట్‌పోస్ట్‌లలో నిర్వహించాలి, ఇతర రాష్ట్రాలతో పంచుకోవాలి. క్రిమినల్ ఇంటెలిజెన్స్ గెజిట్ ద్వారా ప్రతి వారం వాటిని సమగ్రపరచాలి, రాష్ట్ర దర్యాప్తు సంస్థలచే మరింత సమీకరించి, ప్రతి నెలా దేశవ్యాప్తంగా రహస్యంగా పంపిణీ చేస్తారు.

ఎప్పుడు లేని విధంగా, 2018వ సంవత్సరంలో తెలంగాణా రాష్ట్రం చేపట్టిన “సమగ్ర నేర సర్వే” ద్వార “పునరావృత/ స్వాభావిక నేరస్థులు”, “నేరవృత్తి కలిగిన” నేరస్తులుగా విభజించి, వారి గణన చేపట్టిన మొదటి సర్వే ఇది. ఈ సర్వేలో భాగంగా, వారి వేలి ముద్రలు, ఛాయచిత్రాలు, కుటుంబ చరిత్ర, ఫోన్ నంబర్లతో పాటు, వారి నివాస స్థలాలను “జియో - ట్యాగింగ్” (సాంకేతిక సాధనం ద్వారా అంతర్జాల సహాయంతో, వారి స్థలాన్ని నమోదు చేసుట) చేశారు. ఈ సర్వే ద్వారా, ఆధారాలు లేని కారణంగా విడుదలైన వారిని కూడా ఇందులో భాగం చేశారు. ప్రస్తుతం ఉన్న “క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) యాక్ట్, 2022 వలన, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, ఈ సమాచారాన్ని రాష్ట్ర స్థాయిలో కనీసం 75 సంవత్సరాల వరకు పొందుపరుచుకోవచ్చు. బిగ్ డేటా సర్వైవలెన్స్ (భారీ సమాచార నిఘా) సాంకేతిక రాక కాగితపు అవసారాన్ని తగ్గించడంలో ఖ్యాతిని సంపాదించింది. చారిత్రకంగా నేరస్తులుగా ముద్రవేయబడిన జాతులు, DNTలు,పోలీసింగ్ అంశాల చుట్టూ అంతులేని నిరంతరాయాన్ని రూపొందించడానికి బాగా ఉపయోగపడింది.

పాత సీసాలో కొత్త సార: అనుదిన ప్రత్యక్ష నిఘా రూపాల సాంకేతికీకరణ:

నేరస్త తెగల చట్టం, స్వాభావిక నేరస్తుల చట్టంలోని భాగాలను అనుసరించి తెలంగాణ రాష్ట్రం అవలంభించిన వర్గీకరణ పద్దతులు, వాటి ద్వారా కొన్ని ప్రత్యేకమైన నేర చరిత్ర గల జాతుల కదలికల, వ్యవ్యహారాల, సంబంధాల సమాచారాన్ని సేకరించిందని స్పష్టంగా అర్ధం అవుతుంది. నిరంతర  ఆధునీకరణ ప్రాయమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించి, నూతన నిఘా పద్దతుల తోడ్పాటుతో సాంకేతిక నిఘా వ్యవహార శైలిని సత్వర పరిచి, రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్దేశాని స్పష్టం చేసింది. సాంకేతిక నిష్పాక్షికత అను  ఒక అపోహను సాకుగా చూపించి, ప్రస్తుతం ఉన్న నేర సమాచార సంగ్రహమును డిజిటలైజ్ చేస్తూ దాని వ్యాప్తికి కృషి చేయడం చేస్తుంది. ఈ సిద్దాంత ఫ్రేమ్ వర్క్ మీద ఆధారపడి ఇతర రాష్ట్రాలు కూడా స్వాభావిక నేరస్తులను పర్యేవేక్షించడానికి మరింత చొచ్చుకుపోతే సాంకేతిక నిఘా పద్దతులను అవలంభించడం ప్రారంభించాయి. నేరస్త తెగల చట్టపు వారసత్వం ఇప్పుడు “డేటా”(సాంకేతిక సమాచారం) మీద ఆధార పడి వినూత్న సాంకేతిక సమాచార నిఘా వ్యవస్థ ఏర్పాటుకు శిక్షణ సిద్ధం చేసుకుంది

ఇటీవలే ఆవిర్భవించిన రాష్ట్రమైన తెలంగాణ తన “సిలికాన్ వ్యాలీ” కలలను సాకారం చేసుకొనుటకు, నిఘా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టింది. ఒక అధునాతన సాఫ్‍వేర్‍ను ఆవిష్కరించడం ద్వారా, ఛాయచితరాలు, వేలిముద్రల సహాయంతో, గత సమాచారంతో రాష్ట్ర సమాచార సంగ్రహమును ఆశ్రయించి వెతికే ప్రక్రియను వృద్ధిలోనికి తీసుకు వచ్చింది.  ఇప్పుడు ఏ వ్యక్తినైనా, ఫోన్ నెంబర్, రాష్ట్రం చేత జారిచేయబడ్డ గుర్తింపు కార్డ్, ఆధార్ కార్డ్ లేదా ద్రివర్ లైసెన్సు ద్వారా అతని చరిత్రను వెతికి తెలుసుకోవచ్చు. ఇలాంటి ఒక నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం “WinC, Tecdatum’ అనే రెండు సంస్థలకు స్థాపించింది.  నగరంలోని సాంకేతిక పరిశోధకులతో మేం మాట్లాడినప్పుడు, రాష్ట్రం కోసం ఈ నిఘా నిర్మాణాన్ని (సింగపూర్, న్యూయార్క్, ఇజ్రాయెల్ నుండి వచ్చిన సాంకేతికతల ఉదాహరణల ఆధారంగా) చేపట్టే కాంట్రాక్టులు ఎలాంటి నిరూపితమైన రికార్డు లేని కంపెనీలకు ఎలా అందజేశారని విస్మయం చెందాం. 

పలు పోలీసింగ్ పద్దతుల్లో సాంకేతికీకరణ  ఒక కొత్త రకం  "ఆవిష్కరణ" గా సాంకేతికత ఉపయోగం వలన రోజువారీ నిఘా రూపాలను సాంకేతికంగా సంకేతం చేయడం, దృశ్య పరిధిని పెంచడం వంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది.” 

నేరాలకు నెలవైన ఆవాసాలను  గుర్తించడానికి నేర విశ్లేషణను ఉపయోగించడంలో, అలాగే గూఢచారులను ఉపయోగించడం, పెట్రోగస్తీ కాయడం వంటి సాంప్రదాయ నిఘా పద్ధతులను అమలు చేయడంలో ఇది చాలా ప్రముఖంగా కనిపిస్తుంది. గూఢచారులను తయారుచేయడం, గస్తీ నిర్వహించడం, “నేరాలకుక్ నెలవైన ఆవాసాలను” గుర్తిండంలో ఆకస్మికంగా ఉంటుంది.

పైన చెప్పిన విధం గా ‘నేర స్థలాల వ్యవ్రుతీకరణ’ కులవాద  వర్గీకరణ’ కు పర్యాయ ప్రక్రియగా ఆచిరించాపడుతున్నది. అదే విధం గా “నేరానికి నెలవైన ప్రదేశాలను’ గుర్తించడం లో పోలీసుల ఊహాజనిత పదత్తులు ఢిల్లీ లాంటి మహా నగరాల్లో వాడి, అటువంటి ప్రదేశాలల్లో ‘పోలీస్ మోహరింపు, గస్తి’ కి ఆవాసాలు గా పరిగనిస్తారుద.నేరం జరిగే ప్రాంతాల గుర్తింపు, అటువంటి "ప్రాంతాల"లో నిఘా వనరుల కేంద్రీకరణతో కూడి ఉంటుంది. బయోమెట్రిక్ - ఆధారిత, డేటా - ఆధారిత పెట్రోలింగ్ ద్వారా, పోలీసులు తమను తాము సత్వర న్యాయం అందించే వారిగా భావనలో సమర్థవంతంగా ఉంచుతారు. నిఘా ద్వారా శ్రేణి పునరుత్పత్తి పోలీసుల నేర - నియంత్రణ మిషన్‌తో ఎలా లోతుగా ఇమిడిపోయిందో హైదరాబాద్‌పై మా విశ్లేషణ వివరిస్తుంది. 

హైదరాబాద్ లో “నేరానికి అనువైన స్థలానాను” గుర్తించడానికి TS Cop అనే ఆన్లైన్ పోర్టల్ దోహదం చేస్తుంది. దీని ప్రధాన విశ్లేషణాత్మక సాధనం ‘KiteEye ఇంటరాక్టివ్ మ్యాపింగ్ ఆఫ్ క్రైమ్స్ అండ్ యాక్సిడెంట్స్ ఫర్ పోలీస్’ అనే సాఫ్ట్‌వేర్ సిస్టమ్, ఇది ఆరోపించిన నేరాలు ఎక్కడ నమోదయ్యాయి, దానికి స్పందించిన పద్దతి, పోలీసు అధికారుల సంఖ్యను నమోదు చేస్తుంది. ముఖ్యంగా, ఆపద కాల్ (ఎమర్జెంసి కాల్స్ చేసిన ప్రతిసారీ, ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా సంఘటన నమోదు చేయబడినప్పుడు, ఆ ప్రాంతాన్ని జియోట్యాగ్ చేస్తుంది. అదే సమయంలో, పోలీసు అధికారుల పెట్రోలింగ్ 

ఎపుడైనా ఒక ‘ఆపద ను తెలియ చేసే ఫోన్ కాల్’ వచ్చినపుడు, అ వచ్చిన ప్రదేశాన్ని, పోలీస్ యొక్క స్పందనని, అ పరిసర  ప్రాంతాల్లో ఉన్న పోలీస్ గస్తి వాహనాల ప్రదేశాల్ని సైతం సాంకేతిక సాధనాల ద్వారా భౌగోళిక స్థాన  నిర్దేశన చేయడం. GPS - అను పద్ధతి ద్వారా,  భౌగోళిక స్థానం సమాచారమే కాకుండా, ఆ స్థానికక్తు సంబంధిచిన సమయము, దాని చలన పరిభర్మణాంశమును నమోదు చేస్తూ పొందు పరిచే యంత్రరంగం. ఈ సమాచార స్థలాల కేంద్రాలను, వివిధ పారామితులు ఆధారం గా విభజించించేందుకు GPS చిప్స్ ను (సాంకేతిక  పరిజ్ఞానానం తో నిర్మించబడ్డ ప్రత్యేకమైన సాధనాలు, వీటి ద్వారా సమాచారం ను కంప్యూటర్ కు అర్ధమయ్యే భాషా లో కి అమర్చగలుగుతాము) ఉపయోగిస్తున్నారు. ఈ సమాచార  సంగ్రహాన్ని మొత్తం గా అవపోశన చేసి, అతి స్తూల స్థాయి లో వివిధ భారీ నేర  స్థలాలను, చల్ల చెదురు గా ఉన్న చిన్నపాటి నేర స్థలాలను వేరే రంగులలో అనువుగా చూసే వీలు కనిపించేందుకు, ఒక సాంకేతిక క్రమ సూత్రమును తయారు చేసుకుని, సూక్ష్మ స్థాయి లో వివిధ పోలీస్ స్టేషన్ల వారీగా, పోలీస్ వ్యక్తులవారీగా, సమాచారాన్ని అందు బాటు లోని తీసుకు వచ్చారు. అన్ని తరగతుల సమాచారం లో ను, వారి ప్రధానగా  , 'అలవాటు పడ్డ నేరస్థులను' క్రమబద్దీకరించడం, శిక్షించడం మీద దృష్టి సారిస్తారు. వారి సర్వ దృగ్గోచర దృష్టి ని, ఆ నేరస్థుల జీవన విధానం మీద మరు వారి జీవనోపాద్యాయ చోటు లో కేంద్రీకరించే ఒక భౌగోళిక స్థానికాగ్రహణ సాంకేతిక భాషను పెంపొందించడం ద్వారా సాధించగలిగారు.

వాహనాలు కూడా GPS చిప్‌లను ఉపయోగించి భౌగోళికంగా ట్రాక్ చేస్తాయి. భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) వివిధ రకాల వాహనాలు లేదా వివిధ వర్గాల సంఘటనల ద్వారా పెట్రోలింగ్ వంటి విభిన్న డేటా పాయింట్లను చేధిస్తుంది, వ్యక్తిగత, పోలీస్ స్టేషన్‌ల వారీగా వివరాలను వడపోస్తుంది. విస్తృతస్థాయిలో, సాంకేతికత సంగ్రహాన్ని వడపోసి అల్గారిథమిక్ గీతల ద్వారా, నేర విభాగాలలో చెల్లాచెదురుగా ఉన్న చిన్న ప్రాంతాలతో పాటు వివిధ రంగులతో పెద్ద "నేరాలకు నెలవైన స్థలాలను" చూపించే నివేదికలను KiteEye రూపొందిస్తుంది.

అన్ని వర్గాలలో, మినహాయింపు లేకుండా, “పునరావృత/ స్వాభావిక నేరస్థులు” వారి కదలికలు సాఫ్ట్‌వేర్‌ కీలక లక్ష్యాలు. క్రమశిక్షణ, శిక్షల కోసం ఎంచుకున్న పరిసర ప్రాంతాలపై దాని గూఢచర్య దృష్టిని కేంద్రీకరించడం, DNT సమూహాలు నివసించే, పని చేసే ప్రదేశాలలో నేరస్తుడిగా ముద్రపడిన వారిని భోగోళిక ప్రాంతాన్ని ఈ సాఫ్ట్‌వేర్‌ పంపిస్తుంది.

KiteEye మరొక ప్రధాన విధి పోలీస్ వాహనాలు నేరస్థలాలోలి ఎంత తరుచుగా సంచరిస్తున్నాయన్నది నమోదు, ఈ నేరస్థలాలు, స్వాభావిక నేరస్తులకు నెలవుగా ఉన్నయా లేదా అనే అంశం కూడా ఇందులో నమోదు అవుతుంది. DNT గా ముద్ర వేయబడ్డ వ్యక్తుల ఉనికిని ఆధారంగా చేసుకుని, పోలిసుల "ఆపద స్పందనలను”' ఆధారపడేలా ఒక సాంకేతిక పరిజ్ఞానం తయారు చేసుకోవడం అంటే, దైనందీన నిఘాలో భాగంగా ఈ సామాజిక నేపథ్యాల్లోని వ్యక్తులను కుల వ్యవస్థ దృష్టిలో నుంచి మాత్రమే చూసి, ఇప్పటికే “మలినమైన జాతులు” ఈ సమాజాన్ని “మరింత మలినం” చెయ్యకుండా చూసే బాధ్యత మాత్రమే పోలీసులకు అప్పజెప్పారని చెప్పొచ్చు.

“ఊహాజనిత నిఘా” అంచనాను గూఢచార వ్యవస్థ ద్వారా ఫలవంతం అవుతుంది. నిఘా అనేది చారిత్రకంగా ఎక్కువగా పీడిత కుల సమూహాలకు చెందిన “ఖచ్చితమైన గూఢచారుల” “మఖ్బర్” లేదా “ముఖ్బిర్స్” మీద ఆధారపడి ఉంది. Dragnet అనే యాప్ గూఢచారుల నుండి “సున్నితమైన” వ్యక్తుల, సంస్థల, ర్యాలీల, సమావేశాల సమచారాన్ని నిక్షిప్తం చేసేందుకు రూపొందించారు. యాప్‌లో సమగ్రంగా, విశ్లేషించిన మరింత ఆసక్తికరమైన రకమైన సమాచారం పోలీసు స్పెషల్ బ్రాంచ్‌ల నుండి అందుకున్న “సంచారమే”.  ఏదైనా కదలిక, కొత్త సమాచారం, కొత్త సంఘాలు లేదా వెంబడించే వారి వ్యక్తిగత వివరాలు, సంబంధిత "ప్రమాద స్థాయి" సంబంధించిన వివరాలను నమోదు చేయడానికి స్పెషల్ బ్రాంచ్, ఇతర గూఢచార విభాగానికి చెందిన అధికారులు ప్రత్యేకంగా డ్రాగ్‌నెట్‌ను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి పేరు కోసం వెతకవచ్చు. వారి గురించి రికార్డ్ చేసిన అన్ని సమాచారాలను తెలుసుకోవచ్చు, వాటిని హాట్‌స్పాట్‌ల మ్యాపింగ్‌కు కనెక్ట్ చేయవచ్చు. నేరానికి నెలవైన ప్రదేశాలను గుర్తించే వివరాల విస్తరణ, గస్తీ, గూఢచారుల వాడకంతో పాటు, నేరపూరిత జాతి సమూహాలు "సాంకేతికరించిన నేర సమూహాలు”గా పునర్విచరణ చేయడానికి దోహదం చేస్తుంది.

ఊహాజ ణిత భవిష్యసంభవించే ఉపద్రవాలను/నేరాలను  సాదృశయించే పోలీసింగ్' అనేది ఒక భూతకము. ఈ పదత్తి ద్వారా, సమాజం లో ఉన్న సామాజిక  కళంకాలను  ఆధారం గా  చేసుకుని   నేర సంభవాన్ని గ్రహించడమే. పోలీసులు అవలంభిస్తున్న ఈ పద్ధతి, సాంకేతిక పరిజ్ఞానం యొక్క నిష్పక్షపాత వైఖరి మాటున, తటస్థమైన ఊహలు గ పేర్కొంటునప్పటికీ, digitization ద్వారా, కుల-జాతులకు అతీతం గకాకుండా, కులాన్ని, వాటి తాలూకు హింసాత్మకంగా ప్రకటనలు పటిష్ఠమ్ చేయడమే నేర నియంతృత్వ పదత్తి గా ఆవిష్కరించబడినది. 

తెలంగాణా లో సాంప్రదాయక పోలీసింగ్  పద్దతులను , ప్రస్తుతం ఉన్న 'మైత్రీపూర్వక, సాంకేతికపోలీసింగ్' తో పాటు గ పాటించినాడుకు ఎలాంటి అడ్డు లేకపోవడం గమనార్హం. సాంప్రదాయ పడతి పాటించే పోలీసింగ్ లో చట్ట  పరమైన రక్షణ హక్కులను, న్యాయానికి అడ్డు గా భావించిన వారు, నేడు ప్రయివేట్ రంగం లో సాంకేతిక నిపుణుల తో కలిసి, ఇలాంటి చాత్తాదహరిత రక్షణలను తప్పించే విధం గా పనిచేస్తున్నారు. సరదగా మా తో మాటలు కలిపినా ఒక సీనియర్ పోలీస్ వ్యక్తి అరెస్ట్ కు వ్యతిరేకం గా ఉన్న రక్షణ నియమాలు, అసలైన భాదితులకు న్యాయం చేకూర్చడం లో ఎలా విఫలమైయ్యాయో పేర్కొంటూ, ప్రస్తుతం ఉన్న పోలీసులు ఎవరైతే సాంకేతిక పరిజ్ఞానం మీద ఆధారపడి ఉన్నారో, వారు, ఈ 'డ్యూ ప్రాసెస్' ను తరుచుగా విస్మరిస్తున్నట్టు గా పేర్కొన్నారు.

ఐకీకరించు-   శిక్షించు:

స్థానికం గా నేర / నేరస్థుల నమోదు పట్టిక ను నిర్వహించడం అనే పదత్తి ని జాతీయ స్థాయిలో ఆవిష్కరించేయెందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. డిజిటల్ సమాచారాధారిత కులతత్వ పోలీసింగ్ సర్వ సాధారణం గా చలామణి అవ్వడంమానం చూస్తూనే ఉన్నాం. 2009 లో భారతీయ బహుకీన్ద్రియ ప్రభుత్వం ఒక ప్రణాళిక ను సంసిద్ధం చేసింది. దీనిలో ప్రజల భాగ్యస్వామ్యాని పెద్ద పీత వేసి, సుమారు 2013  లో పు పూర్తి చెయ్యాలని భావించి 2017  వరకు పూర్తి చెయ్యగలిగింది

ఈ ప్రణాళికలో, పోలీస్ స్టేషన్ లకు ఒక సమాచార - సాంకేతిక వ్యవస్థను తయారు చేసి ఇవ్వాలన్న ఆలోచన చేశారు. దానికి "Crime and Criminals Tracking System (CCTNS)”గా నామకరణం చేశారు. జాతీయ నేర సమాచార కేంద్రం ద్వారా ఆ నేర సంబంధిత గణాంకాలను సేకరించి "నేరం జరిగిన స్వల్ప సమయంలోనే విచారణ చేసి నేరస్తులను గుర్తించడం” అనే అంశం మీద కనీసం పదిహేను వేల పోలీస్ స్టేషన్ లకు, ఐదు వేలమంది ఉన్నత స్థాయి పోలీసులకు దేశవ్యాప్తంగా శిక్షణ ఇవ్వదలిచింది. దేశవ్యాప్తంగా అరెస్టు రికార్డులు, ఛార్జ్ షీట్లు, ఎఫ్ఐఅర్ వంటి నేర వివరాలనును కేంద్రీకరించి నేర పరిశోధనల వేగాన్ని మెరుగుపరచడం, నేరాలను నిరోధించడం CCTNS పేర్కొన్న ఉద్దేశ్యం. అయితే, అదే సమయంలో, వేలిముద్రలు, ముఖాల గుర్తింపు డేటాబేస్‌ల పెద్ద కేంద్రీకృత భండారాలు వీటితో పాటు జనాభాను కలిగి ఉండి CCTNS డేటాబేస్‌లో లింక్ చేయబడతాయి.  మేము CCTNS ద్వారా సాధ్యమయ్యే ప్రిడిక్టివ్ పోలీసింగ్ స్థాయిని అర్థం చేసుకున్నప్పటికీ, ఒక కొత్త ఆందోళన వచ్చింది: ఇ-కోర్టులు, ఇ-జైళ్లు, ఫోరెన్సిక్స్ ల్యాబ్‌లు మరియు CCTNSలను అనుసంధానించే ఇంటర్‌ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ICJS).  పోలీసు డిపార్ట్‌మెంట్ వెలుపల ఆరోపించిన నేరస్థుల వివరాలను సాధారణ ఇంటర్‌లింక్‌కు మించి ఉంటుంది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నేర న్యాయ వ్యవస్థ ద్వారా ఒక వ్యక్తిని ట్రాక్ చేయడమే కాదు; యాదృచ్ఛికంగా కూడా వారి సహచరులు మరియు నేర న్యాయ వ్యవస్థతో ఇంటర్‌ఫేస్ చేసే వారి వివరాలను కూడా నమోదు చేస్తుంది. ఈ డిజిటలైజేషన్‌లో ఎక్కువ భాగం వివరాలను విశ్లేషించి "హాట్‌స్పాట్‌లను" గుర్తించి, నేరాలను అంచనా వేయగలదని, తద్వారా దానిని తగ్గించడం లేదా నియంత్రించడంలో సహాయపడుతుందనే విశ్వాసంపై అంచనా వేయబడింది. మేము పైన చూపినట్లుగా, హైదరాబాద్ అటువంటి ఇంటర్‌లింకేజ్‌లకు అద్భుతమైన ఉదాహరణగా పనిచేస్తుంది. అవి ఆధారపడిన వివరాలను తటస్థ పద్ధతిలో సేకరించి విశ్లేషిస్తుంది. తద్వారా ముందే ఊహించిన ప్రమాదాలను నివారించడంలో దోహదం చేస్తుంది. అటువంటి వివరాలు ప్రథమంగా పెద్ద మెషీన్-లెర్నింగ్ సిస్టమ్‌లలోకి ప్రవేశించే ప్రక్రియను చూసినప్పుడు ఈ ప్రమాదాలు స్పష్టంగా కనిపిస్తాయి.

భారతదేశ సాంకేతిక పరిణామంలో పోలీసింగ్‌లో తెలంగాణ ముందంజలో ఉంది, అయితే ఇది ఇప్పటికే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో మెచ్చుకునేవారిని, పోల్చదగిన వ్యవస్థలను ప్రోత్సహించింది.  అస్పష్ట చట్ట పరిధి సాంకేతికతను ఉపయోగించి నేరారోపిత సమూహాల నిఘా, వివరాల సేకరణకు దోహదపడింది, ఇది సాంకేతిక కుల గూఢచర్య చట్రాన్ని రూపొందించడానికి దోహదపడింది. 

సాంకేతిక కుల గూఢచర్య చట్రాన్ని నిర్మించడం:

ఈ వ్యాసం  ద్వారా, భారత దేశంలో ని శిక్షా వ్యవస్థ చార్టీత్రాత్మకంగా, వర్తమాననుసారం  గా  కూడా  బ్రాహ్మణీయ కుల సాంప్రదాయ వ్యవస్థ కు పర్యాయ పదంగా వ్యవహరిస్తుందని ప్రతిపాదిస్తూ దానికి తగ్గ విశ్లేషణను ముందు పెట్టడం జరిగింది. 

'ఊహాజనిత  నేరాగమనాన్ని గ్రహించి -హెచ్చరించే పోలీసింగ్ ' పద్దతి కి సహకారం గా నిలిచినా డిజిటల్ సమాచారాధారిత   పోలీసింగ్ -డిజిటల్ సమాచారం ద్వారా     స్థలాలను/ ఆవరణ నెలవులు గా చిత్రీకరించడమే నేర- నియంతృత్వం  గా భావించడం జరిగింది. సాంకేతిక నిశ్పాక్షికత ముసుగులో నిఘా వ్యవస్థను కులతత్వ సంస్థల అమరికగా తీర్చి దిద్దడం లో 'శిక్షా పద్ధతులు కేవలం కొన్ని సంస్థల పరిధిలోని కె కాకుండా వ్యక్తుల వ్యక్తిగత జీవితాలలో కి చొరబడే  విధంగా పోలీసింగ్ వ్యవస్థను తీర్చిదిద్దే విధిని సమర్ధవంతం గా పూర్తి చేశారనే చెప్పాలి. 

బ్రాహ్మణీయ కుల వ్యవస్థ - ప్రస్తుత సాంకేతిక పరమైన నేర-శిక్షా వ్యవస్థల ర్నేడితి మధ్య సంబంధం అవగాహన చేసి, గుర్తించి, తక్షణ కర్తవ్యం గా దయానందనీయ జీవితాలలో కి వ్యాపించి 'నేరారోపణ' పడతి ని అధిగమించడమే- కులతత్వ సమగ్ర-సకల డిజిటల్ వ్యవస్థ నిర్మాణం గా నిర్వచిండం జరిగింది.

సాంకేతిక వివరాల సహాయక నిఘా అనేది “నేర ప్రాంతాలను” విశ్లేశించడం ద్వారా కుపలపరమైన నేర- శిక్షా వ్యవస్థ సాంకేతిక నిర్మాణాన్ని ప్రారంభిస్తుంది. ఇవి హాట్‌స్పాట్‌లుగా, 'ఊహాజనిత  నేరాగమనాన్ని గ్రహించి -హెచ్చరించే పోలీసింగ్ ' పద్దతి కి సహకారం గా నిలిచినా డిజిటల్ సమాచారాధారిత   పోలీసింగ్ -డిజిటల్ సమాచారం ద్వారా     స్థలాలను/ ఆవరణ నెలవులు గా చిత్రీకరించడమే నేర- నియంతృత్వం  గా భావించడం జరిగింది.బయోమెట్రిక్ వర్గీకరణ సాంకేతికతతో ముడిపడి ఉన్న నిఘాపై దృష్టి సారించడం, భారతదేశంలో కులతత్వ నిఘాకు సంబంధించిన దాని సూచనలపై దృష్టి సారించడం ద్వారా ‘నీరo-శిక్షా’ అనేది కేవలం నియమించబడిన బందీఖాన స్వాభావిక సంస్థలకు మాత్రమే పరిమితం కాదని మేము గుర్తించాము. బదులుగా, నిర్బంధం, నిఘా, సాంకేతికతలు "బందీ" ప్రదేశాల నుండి రోజువారీ గృహ, వీధి, సంస్థాగత ప్రదేశాలకు కులాన్ని బట్టి రూపాంతరం చెందుతాయి. మరీ ముఖ్యంగా, ఈ భాగం చర్చించినట్లుగా, చారిత్రాత్మకంగా, వర్తమానంగా భారతదేశంలో శిక్షా వ్యవస్థ అనేది బ్రాహ్మణీయ కుల క్రమానికి పర్యాయపదంగా ఉంది. ఈ రెంటి మధ్య ఉన్న బంధాన్ని గుర్తించడం ద్వారా మనం ఈ రోజువారీ సాంకేతికీకరణను నేరమయాన్ని బయటపరచి, సవాల్ చేయడానికి ఖచ్చితంగా ఓ పేరు పెట్టాల్సి వస్తే : సాంకేతిక కుల గూఢచర్య చట్ర నిర్మాణం. 

(రచయితలందరూ క్రిమినల్ జస్టిస్ & పోలిస్ అకౌంటబిలిటీ (CPA Project), ఇండియాలో సభ్యులు)

ఈ వ్యాసం  మొదట ఆంగ్లంలో ప్రచురించబడింది. 

 1830 : బ్రిటిష్ ప్రావిన్సులపై నిఘా మరియు నియంత్రణ యొక్క రాజకీయ లక్ష్యాన్ని సాధించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాద  పరిపాలన కేంద్ర  దారి దోపిడీ, బందిపోటు దొంగలను అరికట్టే శాఖ (Central Thuggee and Daikait/Dacoity department) ని  ఏర్పాటు చేసింది .

 

1850 : బ్రిటీష్-భారత ప్రభుత్వం హైదరాబాద్ నిజాం పాలకులను నేర సమూహాల మీద  సామ్రాజ్యవాద వర్గీకరణ, నిఘా, పోలీసింగ్  పద్ధతులను అమలు చేయమని బలవంతం చేసింది.

 

1871 : క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ (The Criminal Tribes Act (CTA))అమల్లోకి వచ్చింది. ప్రారంభంలో కొన్ని వర్గాలకు మాత్రమే విస్తరించబడింది.  కదలికలు పరిమితం చేయబడిన వ్యక్తిని అరెస్టు చేయడానికి సంబంధించిన నిబంధన మాత్రం మొత్తం బ్రిటిష్ ఇండియా  వారికి విస్తరించడం జరిగింది

 

1884 : హైదరాబాద్ రాష్ట్ర దారి దోపిడీ, బందిపోటు దొంగలను అరికట్టే శాఖ (state Thuggee and Dacoity Department)  సృష్టించబడింది. దీనిని పూర్తిగా బ్రిటిష్ ఇండియాకు చెందిన కేంద్ర  దారి దోపిడీ, బందిపోటు దొంగలను అరికట్టే శాఖ నియంత్రించింది  మరియు పర్యవేక్షించింది .*

 

1911 : అధికారులకు విస్తృత అధికారాలను ఇవ్వడానికి 1897,1908,1911లలో CTAను సవరించారు. 1911 సవరణను బ్రిటిష్ ఇండియా మొత్తానికి విస్తరించారు.

1924 : 1924లో CTA ను  మళ్లీ సవరించడం జరిగింది .ఆరు (6) ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను వారి నేర తల్లిదండ్రుల నుండి తొలగించడానికి రాష్ట్రాన్ని అనుమతించినంత కఠినమైన అధికారాలు కల్పించడం జరిగింది .

 

1947 : భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యవాద  ప్రభుత్వం నుండి స్వాతంత్రయం  పొంది, నేరుగా బ్రిటిష్ ఇండియా కింద లేని సంస్థానాలను విలీనం చేయడం ప్రారంభించింది.

  

1948 : నిజాం పాలనకు వ్యతిరేకంగా సైనిక చర్య "ఆపరేషన్ పోలో" ద్వారా  స్వతంత్ర భారతదేశం  హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం లోనికి విలీనం చేయడం జరిగింది

1949 : మునుపటి బొంబాయి రాష్ట్రంలో CTA రద్దు చేయబడింది, ఆ తరువాత దేశంలోని మిగిలిన ప్రాంతాలలో CTA ను  రద్దు చేసే అంశంపై దర్యాప్తు చేయడానికి కేంద్ర కమిటీ (అయ్యంగార్ కమిటీ)ని  ఏర్పాటు చేయబడింది.

1952 : అయ్యంగార్ కమిటీ సిఫారసుల మేరకు, చివరకు CTA రద్దు చేయబడింది, తరువాత నేర తెగలను డీనోటిఫై చేసి, వారినే  డీనోటిఫైడ్ ట్రైబ్స్ (Denotified Tribes (DNT)) గా గుర్తించారు .

1962 : ఆంధ్రప్రదేశ్ స్వాభావిక  నేరస్థుల చట్టం (The Andhra Pradesh Habitual Offender Act) అమల్లోకి వచ్చింది.

1987 : పోలీసులు నిర్వహించే వివిధ రిజిస్టర్ల నిఘా మరియు నిర్వహణ విధానాన్ని వివరించే ఆంధ్రప్రదేశ్ పోలీసు కరదీపిక  (Andhra Pradesh police manual) రాష్ట్రంలో అమలు చేయబడింది

2009 : 2014 నాటికి క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్ (CCTNS): పోలీస్ స్టేషన్ల కోసం ఐటి (Information technology) ఆధారిత నెట్వ్రోక్ (network) మౌలిక సదుపాయాలను రూపొందించే ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది.

2010 : ఆధార్ కార్డు అని పిలువబడే కొత్త బయోమెట్రిక్ గుర్తింపు కార్డును కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. **

2014, June  : తెలంగాణ భారతదేశంలోని 29వ రాష్ట్రంగా ప్రకటించబడింది. ఆంధ్ర   ప్రదేశ్ నుండి స్వాభావిక నేరస్థుల  చట్టంతో సహా గణనీయమైన, విధానపరమైన చట్టాలను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించండం జరిగింది

2014, August : NYPD తరహాలో తెలంగాణ పోలీసు వ్యవస్థను మార్చేందుకు ప్రధాన మార్పులు, ప్రణాళికలను  తెలంగాణ ముఖ్యమంత్రి  ప్రకటించడం జరిగింది

 

*అదనంగా, నిజాములు పాలించిన హైదరాబాద్ రాష్ట్రం సామ్రాజ్యవాద  ప్రభుత్వ ఒత్తిడి కారణంగా లంబాడా దుస్తుర్-ఉల్-అమల్ (Lambada Dustur-ul-Amal) అనే వివిక్త నియంత్రణను ప్రకటించింది. ఈ నియంత్రణలో రాష్ట్రంలోని 'నేర తెగలను' నియంత్రించడానికి CTAలో కనిపించే అన్ని చర్యలు ఉన్నాయి.

** 2009లో ఒక కొత్త ఏజెన్సీ, Unique Identification Authority of India (UIDAI), కార్డును తయారు చేయడానికి, అలాగే డేటాను కేంద్రీకృత డేటాబేస్లో నిల్వ చేయడానికి ఏర్పడింది. ఆధార్ అనేది ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. చట్టబద్ధమైన భారతీయ నివాసితులందరికీ, ఆధార్ ప్రాథమిక గుర్తింపు సంఖ్యగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఆధార్ కార్డు పొందడానికి, నివాసి వారి బయోమెట్రిక్ డేటాను (వేలిముద్ర, రెటీనా స్కాన్ మొదలైనవి) సమర్పించాలి.

All authors are members of the Criminal Justice and Police Accountability Project (CPA Project), India.

This piece appears in Logic(s) issue 20, "policy: seductions and silences". To order the issue, head on over to our store. To receive future issues, subscribe.